TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
కలిసిన వెలిచాల రాజేందర్ రావు

*జనవరి మొదటి వారంలో కరీంనగర్ కు వస్తానని *ముఖ్యమంత్రి హామీ..*

రాజేందర్ విన్నపానికి సీఎం సానుకూల స్పందన

మీరు రాస్తున్న ఆర్టికల్స్ అద్భుతంగా ఉంటున్నాయని ముఖ్యమంత్రి కితాబ్

అభివృద్ధి పనులతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా ముఖ్యమంత్రితో చర్చించిన రాజేందర్ రావు

కరీంనగర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పటిష్టత, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రితో రాజేందర్ రావు సుదీర్ఘంగా చర్చించారు. కరీంనగర్ పర్యటనకు రావాలని ఆయన ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. రాజేందర్ రావ్ విన్నపానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. జనవరి మొదటి మొదటి వారంలో కరీంనగర్ కు తప్పకుండా వస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో సమన్వయం చేసుకోవాలని రాజేందర్ రావుకు సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయాలని రాజేందర్ రావు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని, వివిధ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ దినపత్రికల్లో మీరు రాస్తున్న ఆర్టికల్స్ అద్భుతంగా ఉంటున్నాయని, చక్కగా రాస్తున్నారని రాజేందర్ రావును ముఖ్యమంత్రి అభినందించారు. ఆర్టికల్స్ ను తాను క్షుణ్ణంగా చదువుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదే ఒరవడిని నిరంతరం కొనసాగించా లని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మరిన్ని ఆర్టికల్స్ రాయాలని ముఖ్యమంత్రి రాజేందర్ రావుకు సూచించారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రికి రాజేందర్ రావు వివరించారు. ఇందుకోసం నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటా ప్రజలకు అవగాహన కల్పించేం దుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి రాజేందర్ రావు తీసుకువచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను గ్రామ గ్రామానా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు.

అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిం చుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా మాట్లాడడం ఆనందం కలిగించిందని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. జనవరి మొదటి నెలలో కరీంనగర్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పర్యటనకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని సూచించారని చెప్పారు. ఇంకా అనేక విషయాలపై ముఖ్యమంత్రి తో చర్చించానని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.


TEJA NEWS