వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి వినతి
వనపర్తి :
పాత రెవిన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో లు) దాదాపుగా 200 మంది రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్ర రావు మాట్లాడుతూ గతంలో పటిష్టంగా ఉన్న గ్రామ రెవెన్యూ వ్యవస్థను గత భారత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పున ప్రారంభించి పటిష్ట పరచాలని ప్రతి గ్రామానికి రెవెన్యూ వ్యవస్థ అవసరమని పాత పద్ధతిలోనే వీఆర్వో పోస్టింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు అనంతరం డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ వీఆర్వోల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డికి వినతి*
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…