ప్రత్యేక అలంకరణలో విజయాంజనేయ స్వామి
సందర్భంగా విశేష పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు
స్థానిక జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలోని శ్రీ విజయాంజనేయ స్వామి దేవస్థానం నందు మంగళవారం పురస్కరించుకుని ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకం తదుపరి ప్రత్యేక అలంకరణలో స్వామివారికి పూజ నిర్వహించారు.అష్టోత్తర శతనామాలతో స్వామివారికి నాగవల్లి దళార్చన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మరింగంటి వరదాచార్యులు మాట్లాడుతూ మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
సకల కార్య సిద్ధికి విజయాలను చేకూర్చడానికి సకల మనోభిష్టికి ఇక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణలు కంకణబద్ధమై నిర్వహిస్తే అన్ని విజయాలు చేకూర్తాయని ఈ సందర్భంగా తెలిపారు. బుధవారం ఆండాల్ తిరునక్షత్రం సందర్భంగా ఆలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి అభిషేకం మరియు ప్రత్యేక అలంకరణ తదుపరి పాశుర అనుసంధానం తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు మరియు ఆలయ అధ్యక్షులు మండల రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగవల్లి దశరథ, కోశాధికారి ఎలమద్ది అశోక్ కుమార్ మరియు కమిటి సభ్యులు పోతుగంటి రామారావు, జానయ్య మహిళా భక్తులు ఆవుల పద్మ,అజిత,రెసు విజయ,గీత,తదితరులు పాల్గొన్నారు…