వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
శంకరపల్లి : వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్లను శంకర్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఫతేపూర్ బ్రిడ్జి మూసి వాగు వద్ద క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు భక్తి భావంతో శోభయాత్ర జరిపించాలని సూచించారు. సీఐ హబీబుల్లాఖాన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, R&B DE, AE, అధికారులు పాల్గొన్నారు.