ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత

ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత

TEJA NEWS

కేదార్ నాథ్:
చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్ప నిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్‌ధామ్‌కు వీఐపీ దర్శనాలను నిలిపి వేస్తూ ప్రభుత్వ ప్రధానకార్య దర్శి రాధా రాతురి ఆదేశా లు జారీ చేశారు.

అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియోలు తీయడం గానీ, రీల్స్‌ చేయడం వంటివాటిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS