ఐఐఐటి విద్యార్థినికి వి.వి.ఆర్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీలో నివసించే వీరేశం కూతురు సౌమ్యశ్రీ ఐఐఐటి కోర్సు చదవడానికి స్థానిక వి.వి.ఆర్ ఫౌండేషన్ చేయూతనందించింది. మంగళవారం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ యువత నాయకులు వి.ప్రవీణ్ రెడ్డి విద్యార్థిని ఉన్నత చదువులను ప్రోత్సహిస్తూ తండ్రి వీరేశం గారికి వివిఆర్ ఫౌండేషన్ తరఫున ఆరు వేల రూపాయల(6,000/-) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్నారు. ఐఐఐటీలో బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకొని మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మోహన్ రెడ్డి గారు, వెంకటేష్ గారు, మాధవ్ గారు పాల్గొన్నారు