గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు

TEJA NEWS

Wages of Gram Panchayat Workers

* గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా
కలెక్టర్ స్పెషల్ నిధుల నుంచైనా జీతాలు చెల్లించాల.ని కలెక్టర్కు వినతి*..
…………………………………………………………………
వనపర్తి
గతఆరు నెలల గా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయితీ వర్కర్స్ వేతనలను వెంటనే చెలించాలని జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (CITU) సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కాలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అంతకు ముందు మర్రికుంట మెయిన్ రోడ్డు నుండి ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మండ్ల రాజులు మాట్లాడుతూ చాలిచాలనీ వేతనాలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సవతి తల్లీ ప్రేమ చూపుతుందాని వారు అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరిగింది, గ్రామపంచాయతీ కార్మికులు వారి పిల్లల కు విద్యకు సంబంధించిన వస్తువులు (సమగ్రి) ఇప్పించడం కోసం కూడా వారితో డబ్బులు లేవు, ఈ ప్రభుత్వం వారి పిల్లలను చదువుకు దూరం చేసే విధంగా విధానాలను అవలంబిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనలు ఇవ్వాలని లేని యెడల రానున్న వర్షం కాలం సీజన్ లో గ్రామ పంచాయతీ సిబ్బంది మరో మారు ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టిపర్పస్ విధానాని రద్దు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని. ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామపంచాయతీ కార్మికులపై అధికారుల వేధింపులను ఆపాలి డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26000/- ఇవ్వాలని డిమాండ్ చేస్తు. జీవో నెంబర్ 51 సవరించాలని. ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల కు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ సిఐటియు జిల్లా నాయకులు ఎన్ రాములు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు నాయక్ కోశాధికారి. పుష్ప. జిల్లా నాయకులు హనీఫ్ . దాసు. లక్ష్మీనారాయణ పుల్లయ్య విజయలక్ష్మి చెన్నమ్మ ఆనంద్ ఎల్లయ్య రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి