TEJA NEWS

కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీ
కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోడీ కొనియాడారు. వరంగల్‌ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘నాలుగో విడతలో కాంగ్రెస్‌ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు, మైక్రోస్కోప్‌ కావాల్సిందే. కాంగ్రెస్ అబద్ధాలు ఎలా ఉంటాయో, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దాన్ని ఆగస్ట్ 15కు మార్చారు. ఇది మాట తప్పడం కాదా?. తెలంగాణలో RR ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు’ అని ఆరోపించారు.


TEJA NEWS