TEJA NEWS

Warangal-Nalgonda-Khammam graduation election candidate Theenmar Mallanna

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు – MLC ఖమ్మం పాలేరు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో సన్నాహక సమావేశం జరిగింది.

పదేళ్లు అధికారంలో ఉండి, అద్దాల మేడలు, జూబ్లిహిల్స్ గెస్ట్ హౌస్ లలో సేదతీరుతూ నిరుద్యోగ సమస్యలను ఏనాడు పట్టించుకోని కేటీఆర్ & టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఎంతో మంది నిరుద్యోగ యువతలకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ డ్రామారావు(KTR) ఒక్కనాడు మాట్లాడలేదు. మరోవైపు నిరంతరం విద్యార్థులతో ఉంటూ, నిరుద్యోగుల తరపున పోరాడుతూ, ఎన్నో అక్రమ కేసులు వేసిన ఎగసిపడే కెరటం లా నిలబడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇలాంటి విద్యావంతుడికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఖమ్మం పట్టబద్ధులందరినీ రఘునాథ్ యాదవ్ కోరుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్న ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ MLC ఖమ్మం పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ రఘునాథ్ యాదవ్ మాట్లాడారు

ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళ చేసి, 30 వేల ఉద్యోగ పత్రాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఇచ్చి, గ్రూప్ -1 మొదలు మెగా డీఎస్సీ వేలాది ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, డిసెంబర్ 31, 2024 లోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు

ఖమ్మం జిల్లా పట్టభద్రులను ఉద్దేశించి వరంగల్ నల్గొండ ఖమ్మం MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నాపై ఎన్ని కేసులు వేసినా, నిరుద్యోగుల కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతానని, పట్టబద్రులుగా మీరు వేసే ఓటు, వృధా చేయనని. ఒక్క అవకాశం ఇచ్చి చూడని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు

ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారు, TSEWIDC కార్పోరేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ , రైట్ ఛాయిస్ అకాడమీ అధినేత కిరణ్ , ఖమ్మం డిసిసి అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ , ఖమ్మం జిల్లా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీజెఎస్ నాయకులు, అన్ని మండల, గ్రామ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


TEJA NEWS