TEJA NEWS

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసమై 44 మరియు 45 డివిజన్లు కలిపి రామాలయం గుడి మరియు రాంపేట గ్రామంలోని సెంటర్ వద్ద వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కె ఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత మహిళగా, ఒక డాక్టర్ గా సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మన ముందుకు ఎన్నికల బరిలో నిలిచిన వ్యక్తి డాక్టర్ కడియం కావ్య . మన వరంగల్ సమస్యల మీద పార్లమెంట్ లో మన గొంతుకై మన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి మరియు నిత్యం మనకు అందుబాటులో ఉంటూ మన కుటుంబ సభ్యురాలుగా కడియం ఫౌండేషన్ ద్వారా మరియు మీరందరూ ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తే ఎంపీగా సేవ చేసేందుకు మన ముందుకు వస్తున్న మన అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మన హక్కులకు మనకు రావాల్సిన నిధుల గురించి కొట్లాడి తీసుకొని వస్తుందని అలాగే మన ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పాటు చేస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈనెల 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో రెండో నెంబర్ చేతి గుర్తుకు ఓటు వేసి డాక్టర్ కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరిని కోరుతున్నాను..
అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరియు కేంద్రంలో అమలు చేయబోతున్న పథకాలకు ఆకర్షితులై నేడు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య సమక్షంలో సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కోవటం జరిగింది…

ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాజీపేట మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, 44వ మరియు 45వ డివిజన్ అధ్యక్షులు మరియు డివిజన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….


TEJA NEWS