TEJA NEWS

రజకులంతా.. నీలం మధు తోనే ..
చిట్కుల్ ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీసులో
మధు ని మర్యాదపూర్వం కలిసిన
సంగారెడ్డి రజకులు


సాక్షిత : రజకులంతా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు కి అండగా నిలబడి, పార్లమెంటు ఎన్నికలలో గెలిపించుకుంటామని సంగారెడ్డి నియోజకవర్గ రజకులు అభిప్రాయం పడ్డారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీసులో సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలంలోని రజకులంతా నీలం మధు ముదిరాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నీలం మధు ని సన్మానించి, సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బిహెచ్ఎల్ మేడ్చల్ రజక సంఘం నాయకులు ఆంజనేయులు, పలువురు రజకులు పాల్గొన్నారు.


TEJA NEWS