TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పలువురు కాలనీ, ప్రజలు వారి కాలనీలలో సిసిరోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాలు, బోర్ వేల్స్ మరియు తదితర సమస్యలపై వినతి పత్రాలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కి ఇచ్చి విన్నవించగా సానుకూలంగా స్పందించి త్వరలోనే వారి సమస్యలను పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.పలువురు నియోజకవర్గ ఇంచార్జ్ కి పలు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి ఆంజనేయులు, యాదగిరి, మానెయ్య, బిక్షపతి, బ్రహ్మ చారి, మధు, ఆంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు .


TEJA NEWS