
ఉపాధి కూలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
— మనాలి రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పాలకుర్తి,
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ పాలకుర్తి మండలం గుడిపెల్లి, వేమ్నూర్ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూలీలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను ఆత్మీయంగా విన్నారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పెండింగ్ వేతనాలు మరియు చెల్లింపుల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కూలీల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొన్న మనాలి రాజ్ ఠాకూర్, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు టాటా గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు