మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత , మాజీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ , నారాయణ, వేముల మారయ్య మరియు కార్మిక సంఘాల యూనియన్లు, కార్మిక సంఘ లీడర్లు, కార్మిక సంఘ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. “ప్రపంచ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు అన్ని (మేడే) కార్మికుల దినోత్సవాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నారని” అన్నారు.
చివరిగా కార్యక్రమానికి పాల్గొన్న అందరూ కూడా మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బిఆర్ టీయు యూనియన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..