సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని
ఎన్యూమరైటర్లను ఆదేశించిన …… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబ వివరాల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
వనపర్తి మున్సిపాలిటీ లోని ఇందిరా కాలనీ, రామ్ నగర్ కాలనీలలో సర్వే జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. స్వయంగా సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎన్యూమరేటర్లు వివరాలు సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మున్సిపాలిటీ లోని మొత్తం 170 ఈబీలలో సర్వే మొదలు పెట్టాలని సూచించారు. 14 మంది సూపర్ వైజర్లు ఎన్యుమరేటర్లకు పర్యవేక్షణ చేయాలన్నారు. కుటుంబ వివరాల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యూమరేటర్లు వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజలు కూడా సర్వే సిబ్బందికి కావాల్సిన సమాచారాన్ని అందించడంలో సహకరించాలన్నారు.
మునిసిపల్ కమిషనర్ పూర్ణ చంద్ర, ఆర్డివో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేష్ రెడ్డి, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు