TEJA NEWS

ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు.

అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు.

రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా చెప్పడం జరిగింది.

చంద్రబాబు, కవితలు అరెస్ట్ అవుతారంటూ వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన ఎన్నికల్లో విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు. ఇక ఇదే సమయంలో ప్రముఖ వార్త ఛానెల్‌కు సంబంధించిన ప్రతినిధితో ఆయన పెట్టుకున్న గొడవలు తారస్థాయికి చేరడంతో వేణు స్వామి సైలెంట్ అయ్యారు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 సినిమా మినిమమ్ గ్యారెంటీ సినిమా ఆయన చెప్పడం జరిగింది. అల్లు అర్జున్‌కు రాజయోగం ఉందంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు. కట్ చేస్తే అల్లు అర్జున్ ఒకరోజు జైలులో గడపల్సి వచ్చింది. దీంతో వేణు స్వామి జాతకం మరోసారి తుస్సుమంది. , గతంలో జగన్‌ను మరోసారి సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని, కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని చెప్పారు వేణు స్వామి. ఈ రెండు జరగలేదు. తాజాగా అల్లు అర్జున్ విషయంలో కూడా ఆయన చెప్పిన జ్యోతిష్యం లెక్క తప్పింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వేణు స్వామిపై విమర్శలు గుప్పిస్తున్నారు.


TEJA NEWS