నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను గెలిపించండి

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను గెలిపించండి

TEJA NEWS

కాంగ్రెస్ కి ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపండి: దండు శ్రీనివాస్ గుప్త
కొండాపూర్ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని గంగారం, మందాపురం గ్రామాలలో 15 మంది కార్యకర్తలతో కలిసి దండు శ్రీనివాస్ గుప్త డోర్ టు డోర్ కు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించి ఓటు వేయమని కోరారు. అనంతరం దండు శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు ఓటు వేసి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దు గౌడ్, అభిషేక్ గౌడ్, మల్లేశం చారి, రాజు, శ్రీహరి, సంతోష్, శ్రీనివాస్, ప్రవీణ్ చారి, మహేష్ చారి, శేఖర్ చారి, విట్టల్, ప్రవీణ్ కుమార్, రాజు, గౌరీశంకర్ చారి, రాములు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS