TEJA NEWS

హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్


హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం దుకా ణాలు మూసి వేయాలని నిర్ణయించారు.

మహంకాళీ బోనాల పండు గను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపు లు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని మద్యం షాపులు మూతపడ నున్నాయి.


TEJA NEWS