క్రీడల్లో గెలుపు ఓటములు సహజం: శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్
శంకర్‌పల్లి: శారీరక వ్యాయామానికి క్రీడలు ఎంతో అవసరం అని శంకర్‌పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని నారాయణ హై స్కూల్ లో క్రీడా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఐ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాలు పంచుకోవాలని కోరారు. సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచి శారీరక వ్యాయామానికి క్రీడలు ఎంతో అవసరమని తెలియజేసి విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. క్రీడలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీశైలం, దేవేందర్, జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం వల్లి కుమార్, కోఆర్డినేటర్స్ కనకరాజు, అనూష, వనిత, ప్రిన్సిపాల్ లు దివ్య, లక్ష్మణ్, తెరిసా, స్వర్ణరాణి, డిన్స్ వైస్ ప్రిన్సిపల్ ఏవోస్ ఉన్నారు.
