TEJA NEWS

క్రీడల్లో గెలుపోటములు సహజం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం మండలం:
క్రీడల్లో గెలుపోటములు సహజం అని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం గణపురం మండలం సీతారాంపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన వన్ వర్డ్ వన్ యూనియన్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి సీతరాంపూర్ షటిల్ ప్రీమియర్ లీగ్ సీజన్ – 2 టోర్నమెంట్ ముగింపు, బహుమతుల అందజేత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన విన్నర్ టీం కు రూ.10 వేలు, రన్నర్ టీం కు రూ.5 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. క్రీడల అభివృద్దికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతమిస్తుందని ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు, మానసిక ఉల్లాసం వృద్ధ్ది చెందుతుందన్నారు. అదేవిధంగా గెలుపోటములను సమానంగా స్వీకరించాలని కోరారు. గెలవలేనన్న ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడని, ప్రతి క్రీడాకారుడు పట్టుదలతో ఆడాలని సూచించారు.


TEJA NEWS