TEJA NEWS

ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా కొండకల్ గ్రామంలో వివిధ చెరువులలో చేపల పంపిణీ

శంకరపల్లి: : ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా, కొండకల్ గ్రామంలో గల వివిధ చెరువులలో చేపలను వేశారు. ఈ కార్యక్రమం గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య, గుత్తి బాబు, నర్సింలు,శంకరయ్య, ఎల్లయ్య, మహేందర్ మరియు ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొని గ్రామంలో చేపల వేటను ప్రోత్సహిస్తూ చేపలను వేశారు.ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం అనేది మత్స్య వృద్ధి, మత్స్య కారుల జీవితములో ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించే రోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నోంబర్ 21న జరుపుకుంటారు. మత్స్య వృద్ధి పరిశ్రమలో పనిచేసే కార్మికులు, తాపీగా చేపలు వేట, పర్యావరణ పరిరక్షణ అని పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య తెలిపారు.మత్స్య వృద్ధి పరిశ్రమకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, మత్స్య కారుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని” కోరారు.ముదిరాజ్ సంఘ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ పంచాయతీ సెక్రటరీకి మద్దతు అందించారు. ఈ కార్యక్రమం చేపల పెంపకం, వాటి పరిరక్షణ, మరియు వేటలో అవసరమైన పర్యావరణ పరిష్కారాల ముదిరాజ్ సంఘ మత్స్యకారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో నర్సింలు,గుత్తి బాబు, శంకరయ్య, ఎల్లయ్య , మహేందర్ ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS