TEJA NEWS

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో బర్డ్ ఫ్లూ పశువులు, కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూని వ్యాప్తి చేసే హెచ్5ఎన్1 (H5N1) వైరస్ పాలలో ఉండటం వల్ల భారీ ముప్పు ఉందని ఆరోగ్య అధికారులు తెలిపారు. శుద్ధి చేసిన పాలు తాగడం సురక్షితం అని సూచిస్తోంది. పాలలో ఉండే హానికరమైన జెర్మ్స్‌ను శుద్ధి చేయడం ద్వారా నాశనం చేయవచ్చు.


TEJA NEWS