యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అదనపు కలెక్టర్(రెవెన్యూ) జి.వీరారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కొండకింద హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. 2024 మార్చి 11న కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు క్షేత్రానికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సీఎం హోదాలో రెండోసారి ఆయన గుట్ట క్షేత్ర పర్యటనకు వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట
Related Posts
వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం
TEJA NEWS వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం… కోదాడ సూర్యాపేట జిల్లా)వివాహితపై ఆర్ఎంపి లైంగికంగా లొంగక పోవడంతోహత్యాయత్నం చేసిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకున్నది. బుధవారం కోదాడ సీఐ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ కి చెందిన…
బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు
TEJA NEWS బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…