TEJA NEWS

యాదగిరిగుట్ట: దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటో ఎక్కించుకొని ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. గత పాలకులు రెండేళ్లుగా ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేశారని బీర్ల మండిపడ్డారు. ఇప్పుడేమో వారి గురించి దొంగ ఏడుపు ఏడుస్తున్నారని విమర్శించారు. యాదాద్రి అభివృద్ధిలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. రెండేళ్ల తర్వాత కొండపైకి ఆటోలను అనుమతించడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.


TEJA NEWS