TEJA NEWS

మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్ ఫుడ్ కోర్ట్ నుండి యశోద హాస్పిటల్ వరకు మరియు భారత్ పెట్రోల్ పంపు నుండి హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వరకు రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుండి యశోద హాస్పిటల్ ముందు ఫ్లై ఓవర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్య తో వాహనదారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని , దీని దృష్టిలో పెట్టుకొని రూ.262.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది అని నేటి తో ట్రాఫిక్ సమస్య తీరునని, వాహన దారులకు సాంత్వన చేకూరునని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఎన్నో ఏండ్ల ట్రాఫిక్ సమస్య నేటితో తిరునని, ప్రజల సౌకర్యార్థం ,ప్రజావసరాల దృష్ట్యా ,మెరుగైన జీవన ప్రమాణాల కోసం , ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది అని, రద్దీ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం అన్ని హంగులతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, రోడ్డు విస్తరణ పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు. అదేవిధంగా రోడ్డు విస్తరణ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. రోడ్డు విస్తరణ వలన ట్రాఫిక్ తగ్గి ,సమయం , వాహనాల ఇంధనం ఆదా అవుతుంది అని,ప్రజలకు కొంత సాంత్వన చేకూరునని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. అదేవిధంగా మాదాపూర్ డివిజన్ అభివృద్ధి లో భాగంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పడం జరిగినది. రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ తగ్గించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక ప్లై ఓవర్ లు, రోడ్లు,లింక్ రోడ్లు పూర్తి చేశారని ఎమ్మెల్యే గాంధీ గారు తెలియచేసారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానాని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ శర్మ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS