హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెల్లవారుజామునుంచే హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అబిడ్స్, బాలాపూర్, బర్కత్‌పురా, కార్వాన్, సికింద్రాబాద్‌లో జల్లులు కురిశాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈదురుగాలులతో చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.నిజామాబాద్ జిల్లాలో భారీగా పంటనష్టం, పశువులు మృతి చెందగా, సిద్దిపేట,దుబ్బాకలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ.
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…