రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

TEJA NEWS

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

  • వేసవి సెలవుల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలి.
  • పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు.
  • యువకులు సరదాకోసం వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దు. … రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

  • సూర్యాపేట సాక్షిత : వేసవి సెలవు దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి, యువకులకు, ముఖ్యంగా మైనర్ల కు వాహనాలు ఇవ్వవొద్దు అని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ కోరారు. గత నాలుగు నెలలుగా జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే ఉన్నారని తెలిపారు. ఈ సంవత్సరం 91 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తే ఇందులో 40 మందికి పైగా 35 సంవత్సరాల లోపు యువకులు ఉన్నారన్నారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగించే విషయం కావున తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. యువకులు వాహనాలు నడుపుతూ వేగంగా వెళుతూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నది కావున జాగ్రత్తగా ఉండాలని కోరారు. యువకులు సరదా కోసం వాహనాలు నడపడం, వేగంగా వెళ్ళడం, రైడ్స్ నిర్వహించడం లాంటి వాటికి దూరంగా ఉండాలని, సరదాకోసం ప్రమాదాల బారిన పడొద్దు అని కోరారు. పోలీసు శాఖ ఎన్ని భద్రత చర్యలు తీసుకున్న వ్యక్తిగత రక్షణ ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు నియంత్రణలో ఉండాలని అన్నారు.

అధిక వేగం తో వాహనాలు నడపవద్దు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు. హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇన్స్యూరెన్స్, లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి అని కోరారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS