TEJA NEWS

మన్మోహన్ రెండో సారి ప్రధానిగా, వైఎస్సార్ కీ రోల్ – చెరగని ముద్ర..!!

మాజీ ప్రధాని మన్మోహన్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. మన్మోహన్ రెండో సారి ప్రధాని కావటం వెనుక వైఎస్సార్ కారణమని ఆయనే పలు సందర్భాల్లో తెలుగు రాష్ట్రాలకు చెం దిన నేతలతో చెప్పేవారు.

వైఎస్ తో అనుబంధం

మన్మోహన్ సింగ్ 2004, 2009 లో వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. పదేళ్ల పాటు ప్రధాని పదవిలో కొనసాగారు. 2009 లో ప్రధాని కావటం వెనుక ఏపీకి నాడు సీఎంగా ఉన్న వైఎస్సార్ పాత్ర గురించి పలు సందర్బాల్లో మన్మోహన్ చెప్పిన సందర్బాలు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 33 మంది ఎంపీలు గెలుపొందారు. వారి గెలుపు వెనుక వైఎస్సార్ కారణమని మన్మోహన్ విశ్వసించారు. అదే విధంగా నాటి రాజకీయ పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొని రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను వైఎస్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక, సీఎంగా వైఎస్సార్ నాడు ఏపీకి పలు ప్రాజెక్టులను మన్మోహన్ తో చర్చల ద్వారా సాధించారు.


TEJA NEWS