గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

TEJA NEWS

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలియజేశారు.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ పై శుక్రవారం ఉదయం అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ , డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నియమ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని ఆదేశించారు.
10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలో అనుమతి లేదని స్పష్టంగా వివరించారు.
ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలో అనుమతించాలని 10 గంటలకు గేట్ లు మూసి వేయాలని అన్నారు. 9.30 నుండి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని సూచించారు. పరీక్ష అయిపోయే వరకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మధ్యాహ్నం 1.00 గంటకు ముందు ఏ ఒక్క అభ్యర్థిని పరీక్షా కేంద్రం నుండి బయటకు పంపడానికి వీలు లేదని తెలియజేశారు.
బాధ్యతలు అప్పగించిన అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యానికి తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఒక్క తప్పు జరగడానికి వీలు లేదని హెచ్చరించారు.
పరీక్ష కేంద్రంలో సెల్ ఫోన్ తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని తెలిపారు.
అధికారులు ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు పరిషిలించుకోవాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రంలో కనిపించే ప్రతి ఒక్కరి అధికారిక గుర్తింపు కార్డులు, హాల్ టికెట్ లు పరిశీలించాలి. పరీక్షల నిర్వహణకు సంబంధం లేని ఏ ఒక్కరూ పరిసరాల్లో కనిపించడానికి వీలు లేదన్నారు.
పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానికి పరికరాలకు అనుమతి లేదు. అధికారులు, ఇన్విజిలెటర్లు సైతం ఫోన్ కానీ డిజిటల్ గడియారం కానీ తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని తెలిపారు.
పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి వాహనాలు నిలపడాని వీలు లేదని తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయనీ హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ప్రొజెక్టర్ ద్వారా బాధ్యతలు, నియమ నిబంధనలను వివరించారు.
రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS