TEJA NEWS

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు..

పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీలు తొలగింపు.

పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న 1444 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 931 ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

ఇప్పటికే అనేక రోజులుగా వేచి చూడటం జరిగిందని అన్నారు. సోమవారం తొలగింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈనెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


TEJA NEWS