ఘనంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమం

TEJA NEWS

ఘనంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమం

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు వారి గురించి మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్, భాయ్ లడ్బా, ఝవేర్‌భాయ్ దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌ లోని నాడియార్‌లో జన్మించారు.ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్న అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం వారికి 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారుపల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ ఉపాధ్యక్షులు హనుమాన్ సింగ్, పట్టణ కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ, మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని, బిజెపి నాయకులు ఉప్పాల భాస్కరరావు, బీజేవైఎం నాయకులు మణికుమార్, మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ, జోలపురం రాయుడు, ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు, రూరల్ మండల మాజీ అధ్యక్షులు కక్కెర పుల్లారావు, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పులి గుజ్జి మహేష్, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top