శంకర్ పల్లి పట్టణంలో 20-24 స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా 26, 27 తేదీలలో జరిగే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి.
శంకర్ పల్లి ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.
శంకర్ పల్లి ;
శంకర్ పల్లి పట్టణంలో స్వచ్ఛతహి సేవ 20-24 భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేస్తున్నామని కమిషనర్ జి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 26వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంద్రారెడ్డి చౌరస్తా నుండి గెస్ట్ హౌస్ వరకు విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 27వ తేదీన శుక్రవారం ఉదయం7:30 పట్టణంలోని ఇంద్రారెడ్డి చౌరస్తా నుండి బీడీఎల్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, సీనియర్ సిటిజన్స్, మహిళలు, ఎస్ హెచ్ జి సభ్యులు, అసోసియేషన్ సభ్యులు, పత్రిక మిత్రులు, పట్టణంలోని వివిధ శాఖల అధికారులు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలు కమిషనర్ కోరారు.
శంకర్ పల్లి పట్టణంలో 20-24 స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
TEJA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ గౌరవించాయి…
హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి
TEJA NEWS హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్…