ఇంటి నిర్మాణానికి రూ.4,00,000
ఇంటి నిర్మాణానికి రూ.4,00,000
2024-25 నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇవ్వనుంది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందించనుంది. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం అధికారులతో సమీక్షించనున్నారు.