5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ..!
పల్నాడు జిల్లా :-
“పెదకూరపాడు నియోజకవర్గం”
పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ 16 గోతాలను పెదకూరపాడు పోలీసులు పట్టుకున్నారు.
బలుసుపాడు గ్రామానికి చెందిన బాజీ గంజి, మల్ల విజయ అనే ఇద్దరు అక్రమంగా పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అని పక్కా సమాచారం రావడంతో పెదకూరపాడు ఎస్సై గిరిబాబు గారు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి బియ్యం ఉన్న 16 బస్తాలను ఆటోను సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
సీజ్ చేసిన రైసు ను సంబంధిత శాఖ డిటి కి అందజేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ప్రెస్ మీట్ కి ఎస్ఐ గిరిబాబు తెలియజేశారు …