భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

TEJA NEWS

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి..

ఢిల్లీ..

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 841 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో(ఆదివారం ఉదయం 8 వరకు) వైరస్ బారిన పడి మొత్తం ముగ్గురు మరణించారు. వీరిలో కేరళ, కర్ణాటక, బిహార్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు చెప్పారు. 2023 డిసెంబరు 5 వరకు దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకు మాత్రమే పరిమితమై ఉండేదని, అయితే కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి చెందుతుండడం, పైగా శీతాకాలం కావడం వల్ల ప్రస్తుతం ఈ కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు వెల్లడించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS