సాక్షిత తిరుపతి నగరపాలక సంస్థ:
ప్రజలకి ఇబ్బంది కల్గిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీ కోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి పిర్యాధులను, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన పిర్యాధులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారులతో చర్చించి, సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇవ్వడం జరిగింది. తిరుపతి కార్పొరేషన్ 33వ డివిజన్ కార్పొరేటర్ దూది కుమారి భర్త దూది శివ వినతి పత్రం ఇస్తూ అశోక్ నగర్లో వెలుతున్న పెద్ద కాలువలో సిల్ట్ తొలగించాలని, స్కావేంజర్స్ కాలనీలో అనేక చోట్ల యుడిఎస్ పొంగి పొర్లుతున్నాయని, తిరుమల బైపాస్ రోడ్డు నందు నిర్మించిన అక్రమ దుఖణాలను తొలగించాలని చెప్పడంతో స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ కాలువల్లో సిల్ట్ తొలగించే పనులు చేపట్టామని, ఆక్రమణలను తొలగిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమైన పిర్యాధుల్లో మారుతి నగర్, రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతు నిర్మించిన సిసి రోడ్డుకు మాజి మంత్రి పెద్దిరెడ్డి ఇరువైపులా రెండు గేట్లను పెట్టించడంతో సామాన్య ప్రజలు రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, శెట్టిపల్లిలో లే అవుట్ ను క్రమబద్దికరించి, ఫ్లాట్లను కేటాయించాలని, బ్లిస్ దగ్గర మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న దని, శంకర్ కాలనీలో త్రాగునీటిలో డ్రైనిజి నీరు కలుస్తున్నదని, క్రైం స్టేషన్ వెలుక వైపు ఎనుములు కట్టేయడం వలన పరిసరాలు ఇబ్బందిగా తయారు అయ్యాయని, నెహ్రూ నగర్లో కావమ్మ, మారియమ్మ గుడి ముందర వర్షం నీరు నిల్వ వుండి పోతున్నదని, సున్నపు వీధిలో తరుచు కాలువలు పొంగుతున్నాయని మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజి సమస్యలు పరిష్కరించాలనే పిర్యాధులపై కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపర్డెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆక్రమణలు ఉపేక్షించం, కాలువలు పూడిక తీస్తున్నాము , ఐఏఎస్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…