TEJA NEWS

కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.


TEJA NEWS