TEJA NEWS

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక…

షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు…

129 – సూరారం డివిజన్ షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అడ్డగోలు హామీలతో ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, పోలే శ్రీకాంత్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, రవికుమార్, ఇస్మాయిల్, అశోక్, శశి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS