TEJA NEWS

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను కావాలని అడ్డుకుంటున్నారని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.
అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకుండా ప్రజల సమస్యలపై అధికారులను అడిగితే తమకు సహకరించడం లేదని వాపోయారు. కాంగ్రెస్ నాయకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అధికారులు వారి మాటలు విని మాకు సహాయ నిరాకరణ చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు గుర్తుంచుకోండి ఐదేళ్ల తర్వాత మళ్లీ మేము అధికారంలోకి వస్తాము అప్పుడు మీరేం చేస్తారు అని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ నాయకులు జరుగుతున్న పరిణామాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….


TEJA NEWS