TEJA NEWS

తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా బస్సు ఫ్రీ అని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం

గద్వాలలో ఆర్టీసీ బస్సులో మహిళలకు టికెట్లు తీసుకోవాలని హుకుం జారీ

ప్రభుత్వ జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్న మహిళ ప్రయాణికులు

జోగులాంబ గద్వాల జిల్లా:
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. గద్వాల జిల్లా కేంద్రం నుండి కొన్ని ఏళ్ల తరబడి శ్రీశైలానికి బస్సు వెళ్లడం జరుగుతుంది. గద్వాల్ నుంచి శ్రీశైలం కు ఎక్స్ ప్రెస్ బస్సు ను నడిపే ఆర్టీసీ అధికారులు నేడు కొత్త రూల్స్ కు శ్రీకారం చుట్టి ఎక్స్ ప్రెస్ బస్సు కు బదులు డీలక్స్ బస్సును నేటి నుంచి శ్రీశైలం కు ఏర్పాటుచేసి మహిళలకు కూడా టికెట్లు తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్న సంఘటన గద్వాల ఆర్టీసీ లో జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ బస్సులో వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అని చెప్పినప్పటికీ దానికి విరుద్ధంగా మహిళల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని మహిళలు సోషల్ మీడియాకు తెలిపారు. ఇట్టి విషయంపై జిల్లా ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతున్నారు మహిళా ప్రయాణికులు.

తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

TEJA NEWS