గురు. జూలై 18th, 2024

హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

TEJA NEWS

హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరా బాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్‌ఐ,అధికారులు ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుమారు నాలుగు కిలోల వరకు పట్టుబడ్డ బంగారం ఉంటుందని డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు పేర్కొన్నారు.

అక్రమంగా బంగారాన్ని పలువురు వ్యక్తులు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందిందని, ఆ మేరకు అధికారుల సోదాలు జరిపి.. వలవేసి చాకచక్యం గా పట్టుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నామని, వారిపై కేసు నమోదు చేసి విచారి స్తున్నట్లు మీడియా కు తెలిపారు.

జులై 6వ తేదీన ఇద్దరు వ్యక్తులు నడుముకు ధరించే పట్టీలో బంగారాన్ని తీసు కొస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులపై కస్టమ్స్‌ చట్టం కింద అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత
Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page