వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం
పెరిగిపోతున్న వ్యర్థాలతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిని ప్రత్యేక ప్రణాళిక ద్వారా పిఠాపురం, భీమవరం నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలు, కాలువలు, చెరువుల వెంబడి చెత్త వేసే విధానాలను ఆపేయాలన్నారు.