జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు
రాష్ట్రప్రభుత్వ పెన్షనర్లకు సంబందించిన అనేక సమస్యలు అపరిష్కృతముగా ఉన్నాయని అట్టి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు పెన్షనర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్ల అతిముఖ్యమైనది మరియు ఆందోళనకరమైన సమస్య E.H.S. (ఉద్యోగుల ఆరోగ్య పథకం) పథకము సక్రమముగా అమలుగాకపోవడమే. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్నులు మరియు జర్నలిస్టులకు ప్రెసిడెంట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యము అందించడము ఈ పథకము యొక్క ముఖ్యవుద్దేశము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ పథకము ప్రారంభమైనప్పటికి నేటికి కూడా అమలు కావడం లేదు.
పైబడిన వృద్ధి పెన్షనర్లు రకరకాల వ్యాధులతో బాధపడుతుండడం సర్వసాధారణమే. వైద్య చికిత్సలనిమిత్తము ఆసుపతులలో చేరిన ప్రతిసారి పద్దముత్తములో డబ్బు చెల్లించవలసివస్తున్నది. తమైన వైద్యఖర్చులను భరించలేక పెన్షనర్లు అనేక ఇబ్బందులకు గురిఅగుచున్నాడు. మొదటి. సి. రవిజన్ కమిషన్ సిఫారసులకు అనుగుణముగా ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలన్ని తమ మూలవేతనము/(పెన్షన్) నుండి నగదు రహిత వైద్యచికిత్స నిమిత్తము 18 సొమ్ము మినహాయించుటకు అంగీకరిస్తూ ప్రభుత్వానికి వినతి పత్రములు సమర్పించనైనవి. గతప్రదుత్వము జి.ఓ. నెం. 186 స్వరూపాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసినారు కానీ దాని తర్వాత గైకొనవలసిన చర్యలు ఏవీ కూడా అమలులోకి రాలేదు. ఇక మెడికల్ బిల్లుల Reimbursement విషయాన్ని పరిశీలిస్తే నెలల తరబడి కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి వివిధ కార్యాలలో కాలయాపన జరిగి ఉత్తరువులు వెలుబడనప్పటికి ఇ – కుబేర ద్వారా సకాలములో చెల్లింపులు జరగడం లేదు. ఇట్టి చెల్లింపులు కూడా ఖర్చైన మొత్తములో నామ మాత్రమే. తమ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ పథకములో గతంలో గల గరిష్ట మొత్తాన్ని ఐదు లక్షలనుండి పది లక్షలకు పెంచడం స్వాగతిస్తున్నాము.
అతిముఖ్యమైనదిగా పరిగణించి E.H.S. పదకము ద్వారా పెన్షనర్ల మూలపెన్షన్ నుండి 1% మినహాయించి సహృదయంతో వెంటనే నగదురహిత వైద్య చికిత్స అందించే ఏర్పాటు చేయగలరని యావత్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పక్షాన వినమ్రముగా విజ్ఞప్తి చేయుచున్నాము.
- ప్రస్తుతము పెన్షనర్లు తమ పొదవీ విరమణ సందర్భములో కమ్యూటేషన్ ద్వారా పొందిన మొత్తాన్ని 15 సం.లు (180 వాయిదాలలో) రికవరీ చేయబడుచున్నది. చాలాకాలం క్రితము అప్పటి వడ్డీ రేట్లు తదితర అంశాలను దృష్టియందుంచుకొని రికవరీ కాలాన్ని 15 సం.లు, గా నిర్ణయించడం జరిగినది. కానీ ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారము 10 సం.ల 8 నెలల్లో ( 128 నెలల్లో) వడ్డీతో సహ పెన్షనర్ల ద్వారా కమ్యుటేషన్ మొత్తము రికవరీ జరుగుచున్నది.
కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలలో కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 12 సం.లకు తగ్గించి ఉత్తర్వులు జారీ చేయబడి అమలు చేయబడుచున్నది. పంజాబ్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పదవీ విరమణ తరువాత 10 సం.లు దాటిన అట్టి పెన్షనర్ల నుండి కమ్యుటేషన్ రికవరీ ఆపాలని ” స్టే ఉత్తర్వులు కూడా ఇచ్చినారు.
కావున పెన్షనర్ల నుండి కమ్యూటేషన్ రికవరీ కనీసము 12 సం.లకు తగ్గించుటకు తగు చర్యలను గైకొనవలసినదిగా మనవి.
- పెన్షనర్లకు రావలసిన D.R. (Dearness Relief) నాలుగు వాయిదాలు విడుదల చేసి ఏక మొత్తములో బకాయిలు చెల్లించవలసినదిగా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు విజ్ఞప్తి చేశారు.