TEJA NEWS

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ..

జగిత్యాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బందెల తక్ష విహార్ విద్యార్థి అమెరికా ఎన్ ఎస్ ఎస్ నాసా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచారు. కాస్మోస్ పారిడార్ అనే ప్రాజెక్టులో అమెరికాలో జరిగిన సమావేశానికి హాజరై జాతీయ స్థాయిలో రెండవ స్థానం సాధించారు ఈ సందర్భంగా తక్ష విహార్ అభినందన సభ లో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించి సత్కరించారు. మరియు పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బృందాన్ని కూడా అభినందించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో మంచి ప్రతిభ కనబరిచి జగిత్యాల పేరును జాతీయస్థాయిలో నిలిపిన విద్యార్థికి అభినందనలు అని ఇంకా మరిన్ని విజయాలు భవిష్యత్తులో సాధించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమం లో ప్రిన్సిపల్ సచిన్, సరిత విలియమ్స్ ,డీన్ శ్రీనివాస్, ఏవో సందీప్,పేరెంట్స్ డా.విజయ్,డా.గీతిక తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS