TEJA NEWS

2024 ఒలింపిక్స్‌ బరిలో:బిహార్‌ ఎమ్మెల్యే

హైదరాబాద్:
పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడాపోటీలు అట్టహసంగా ఆరంభమయ్యాయి. మనదేశం తరుపున 117 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా వారిలో బిహార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు.

బీహార్ లోని జముయ్ శాసనసభ్యురాలిగా ఎంపిక కాకముందే శ్రేయసి సింగ్ షూటింగ్ క్రీడాకారిణి. అలాగే అర్జున అవార్డు గ్రహీత కూడా.

డబుల్ ట్రాప్ విభాగంలో 2024లో గ్లాస్గో లో కామన్‌ వెల్త్ గేమ్స్ లో రజత పతాకాన్ని 2018లో గోల్డ్‌కోస్ట్ జరిగిన పోటిల్లో బంగారు పతాకాన్ని సాధించారు.

శ్రేయసి సింగ్ గిదౌర్ లో పుట్టి పెరిగారు. ఫరిదాబా ద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటిలో ఎంబీఏ పూర్తి చేశారు. 2020లో జరిగిన బీహర్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేపై 41 వేల ఓట్ల మెజారీటితో గెలిచారు.

శ్రేయసి బీహర్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమారై. తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గ ఎంపీ. తల్లి దండ్రులిద్దరూ రాజకీయాల్లో రాణించడంతో తను కూడ ఆ దిశగా అడుగులు వేశారు.

తాత, తండ్రి ఇద్దరు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా వ్యవహిరిం చారు. ఆ ప్రేరణతోనే షూటింగ్‌లో కెరియర్ నిర్మించుకోవాలనుకున్నారు.


TEJA NEWS