TEJA NEWS

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన ముందుగా గవర్నర్​ను శాలువాతో సన్మానించారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా రాధాకృష్ణన్‌ను స్థానంలో జిష్ణుదేవ్‌ వర్మను తెలంగాణ గవర్నర్​గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ(66) రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.. కేపి


TEJA NEWS