TEJA NEWS

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: గర్భిణీ తో సహా శిశువు మృతి…!!

మెదక్ జిల్లా:
మెదక్ జిల్లా మనోహరా బాద్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఈ ఏడు నెలల గర్భవతి తో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు రోడ్డు పై పడి చనిపోయింది..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మిరుదొడ్డి మండలా నికి చెందిన భార్యాభర్తలు మనోహరాబాద్ నుండి దండుపల్లి కి బైక్ పై వెళు తున్న తరుణంలో జాతీయ రహదారి రోడ్డు క్రాస్ చేస్తుండగా…

తూప్రాన్ నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో భార్యా భర్తలు వెళ్తున్న బైకు కింద పడిపోయింది. మహిళ గర్భవతి కావడంతో మహిళ మృతిచెందగా ఆమె కడుపు లో ఉన్న ఏడు నెలల శిశువు కడుపు నుండి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయింది.

ఈ దారుణ సంఘటన చూసిన వారు కంటతడి పెట్టారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


TEJA NEWS