TEJA NEWS

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ లొనే నిర్వహించాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సీపీఐ చేసిన అనేక పోరాటాల వల్ల మెడికల్ కాలేజ్ ను కుత్బుల్లాపూర్ లో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్ నిర్వహణ కోసం భవనం లేదని నేడు ఇతర ప్రాంతాలో మన పేరుతో నిర్వహించడం దురదృష్టకరమని కావున వెంటనే స్థానిక శాసనసభ్యుడు వివేకానంద మెడికల్ కాలేజ్ మన ప్రాంతంలో నే ఉండేలా చర్యలు చెప్పటలని డిమాండ్ చేశారు.
సీపీఐ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ లొనే మెడికల్ కాలేజ్ సాధన కొరకు అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమ్ నిర్వహించి పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అధికారంలో ఉన్న నాయకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల గతంలో జగతగిరిగుట్ట కు మంజూరు అయ్యిన ఎస్సీ,ఎస్టీ గురుకుల విద్యాలయం తరలిపోవడం, మళ్ళీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ పోవడం జరిగిందని ఇప్పటికైనా అధికారంలో ఉన్న పార్టీల నాయకులు ప్రజల సంక్షేమం కోసం పనిచేయ్యాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యుడు హరనాథ్,ప్రజానాట్యమండలి జిల్లా, మండల అధ్యక్షుడు ప్రవీణ్,బాబు,కార్యదర్శి భాస్కర్,మండల కోశాధికారి సదానంద్, కార్యదర్శి సహదేవరెడ్డి, సీపీఐ నాయకులు డప్పు రామస్వామి,సామెల్,ఇమామ్, ప్రభాకర్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS