వినాయకునికి ప్రత్యేక పూజలు ||
కుత్బుల్లాపూర్నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.