TEJA NEWS

ఫార్మా ,సెజ్ కార్మికుల, ప్రజల భద్రతకై సిపిఎం రక్షణ యాత్రను జయప్రదం చేయండి. గోడ పత్రిక ఆవిష్కరణ. సిపిఎం జిల్లా నాయకులు వి.వి.రమణ..

సెప్టెంబరు 16 నుండి 20 వరకు పాయకరావుపేట నుండి పరవాడ వరకు మోటార్ సైకిల్ యాత్ర నిర్వహిస్తూ 20వ తేదీన అచ్యుతాపురం జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు వి.వి రమణ కోరారు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ లో మంగళవారం బైక్ యాత్ర గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవణ మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రత లేదని ఏ కంపెనీలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన అభద్రతాభావం కార్మికుల్లో ఉన్నదని మన జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాలు నిరంతరం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు హడావుడి చేయడం తప్ప కార్మికుల భద్రత పట్టించుకోవడం లేదు అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయని వేలాది ఎకరాలు రైతులు త్యాగం చేసి నిర్వాసితులయ్యారు స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన ఈ ప్రాంతంలో కాలుష్యం కోరల్లో ప్రజల అల్లాడుతున్నారని, సముద్రంలో మత్య సంపద నశించి పోవడంతో మత్స్యకారులు వేటలేక వలసలు పోతున్నారు పరిశ్రమలలో స్థానికులకు నిర్వాసితులకు 75శాతం ఉద్యోగాలు కల్పించాలని నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించాలని ,కార్మికుల రక్షణ మొదటి ప్రాధాన్యతగా ఉండాలని ,ప్రభుత్వం, యాజమాన్యాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఈ బైక్ యాత్ర చేస్తుందని దీనికి కార్మికులు ప్రజలు నిర్వాసితులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ,సిపిఎం నాయకురాలు పి మాణిక్యం, ఏ బంగారు రాజు,కే సత్య, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS